అక్కినేని కోడలు కొత్త సినిమా ఆ “హీరో”తోనా - sexy samantha actress next movies with అక్కినేని కోడలు కొత్త సినిమా ఆ “హీరో”తోనా
అక్కినేని కోడలు అంటే ఈపాటికే మీకు అర్థమై ఉంటుందిలెండి,నిన్న మొన్నటిదాక అందరూ ఈ విషయమే లోలోపనే మాట్లాడేవాళ్ళు,ఎప్పుడు అయితే సమంత, నాగచైతన్య మీడియా సాక్షిగా చెప్పారో అప్పటినుండి పబ్లిక్ అయ్యింది, అయితే వీళ్ళు ఇలా మీడియా ముందు ఓపెన్ అవటంతో కొంతమంది గాసిప్స్ రాయుళ్లకు పని లేకుండా చేశారు అనుకో అది వేరే విషయం.
జనతాగ్యారేజ్ తో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్న సమంత ఆ సినిమా తర్వాత ఇంతవరకు మరే తెలుగు సినిమాలో నటించలేదు, కానీ తమిళంలో శివకార్తికేయన్ కధానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో నటిస్తుంది, అయితే తాజాగా మరో తమిళ్ నిర్మాత సమంతని కలిసినట్టు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘కత్తి సందాయ్’ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్న హీరో విశాల్,ఆ సినిమా తర్వాత నటించనున్న కొత్త చిత్రం ‘ఇరుంబు తిరై’. ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు,ఈ చిత్రంలో కధానాయిక కోసం సమంతని సంప్రదించినట్టు సమాచారం, సమంత కథ నచ్చి ఓకే చేస్తే విశాల్ తో తాను కలిసి నటించే మొదటి సినిమా అవుతుంది, అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు.
No comments:
Post a Comment