telugu kavitha lu
నా కలలేనాడో....
నీ కనులవాకిట్లలోనుండి కరిగిపోయాయని తెలుసు......
గతించిన వైభవాలు తిరిగిరావని తెలుసు,
నువు ఇక రాలేవని తెలుసు
కానీ ఎపుడైన ఆప్రయత్నంగా నువు తారసపడినపుడు
నను ఆకర్షించిన ఆ కనులను చూడకుండా ఉండలేను...........
కానీ
మళ్ళీ ఓ క్షణంపాటు అనిపిస్తుంది
నీ కనుపాపలింకా నను వెతుకుతున్నాయేమోనని...........
నీ కనురెప్పల గడపలు
నాకు స్వాగతంపలుకుతున్నాయేమోనని..........
No comments:
Post a Comment