రతి సమయంలో ఆచరించవలసిన క్రియలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 17
రతి సమయంలో ఆచరించవలసిన క్రియలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. రతిసమయంలో విశేషాలను రాగవత్తు, ఆహార్యరాగం, కృత్రిమ రాగం, వ్యవహిత రాగం, పోటారతం, ఖలరతం, అనియంత్రిత రతం అని వాత్స్యాయనుడు విభజించాడు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
ప్రేయసీ ప్రియులు కొద్దికాలం పాటు వియోగం తర్వాత మరల కలుసుకొన్నప్పుడు, ప్రణయ కలహం వల్లకానీ మరే కారణాల వల్లనైనా కానీ కొంతకాలం దూరంగా ఉండి తర్వాత కలుసుకున్నప్పుడు జరిగే రతాన్ని రాగవత్తు అని అంటారు.
స్త్రీ పురుషులు ముందుగా ఎటువంటి పరిచయం లేనివారైనప్పటికీ వారి మధ్య ప్రేమ అంకురించి అది వారి కలయికు దారి తీస్తే అప్పుడూ అది రాగవత్తు అనే అంటారు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
రాగవత్తులో ప్రేయసీ ప్రియులు అంతకుముందే పరస్పరం ప్రేమానురాగాలు వృద్ధి పొందించుకున్నవారు కాబట్టి తమ తమ అభిప్రాయాలను అనుసరించి రతిక్రీడలో మునిగి తేలతారు.
స్త్రీ పురుషులు కేవలం చూపులతో పొందే సుఖాన్ని ఆహార్యరాగం అని అంటారు. స్త్రీ పురుషులు తన మనోగతాన్ని గురించి ఎదుటివారికి చెప్పకుండా చూపులతో వెంటాడుతూ తాపం తీర్చుకోవడమన్న మాట. ప్రేయసీ ప్రియులలో ప్రేమ అంకురించి, ఆ ప్రేమను వెల్లడించక ముందు సాగే ప్రక్రియగా దీన్ని పేర్కోవచ్చు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
కృత్రిమ రాగం:
స్త్రీ పురుషుల మధ్య నిజమైన ప్రేమ జనించకుండా ఇద్దరిలో ఎవరైనా ఏదైనా ప్రయోజనం ఆశించి ఎదుటివారితో సంబంధం ఏర్పరచుకుంటే దానిని కృత్రిమరాగం అని అంటారు.
స్త్రీ మరో పురుషుడిని, పురుషుడు మరో స్త్రీని ప్రేమిస్తూ ఏదైనా ప్రయోజనంతో ( ధనం, రహస్యాలు తెలుసుకోవడం వంటివన్నమాట) రతిక్రీడకు సమ్మతిస్తే దానిని కృత్రిమ రాగం అని అంటారు. కృత్రిమరాగంలో స్త్రీ పురుషుల మధ్య అనురాగానికి తావుండదు. ఇతర విషయంపైనే వారి దృష్టి నిమగ్నమై ఉంటుంది.
వ్యవహితరాగం:
స్త్రీ పురుషులు పరస్పరానురాగంతో రతి క్రీడలో పాల్గొంటే దానిని వ్యవహితరాగంగా చెప్పుకోవచ్చు. కృత్రిమరాగానికి ఇది పూర్తిగా విరుద్ధమైంది. ఇలా కాకుండా కేవలం పురుషుడే స్త్రీ పట్ల అనురాగం కనబరుస్తూ రతి సాగించినా దానిని కూడా వ్యవహిత రాగంగానే భావించవచ్చు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
పోటారతం:
కామం తీర్చుకోవడం కోసమే స్త్రీ పురుషులు తమ పనివారితో సాగించే రతిని పోటారతం అని అంటారు. పోటారతంలో స్త్రీ పురుషుల మధ్య అనురాగముండదు. కామం తీర్చుకోవడమే వారి లక్ష్యం. ఇటువంటి రతి క్రీడలో రతి క్రీడ జరపాలే తప్పితే ముద్దులు, ఆలింగనాలు వంటి అనురాగ సంబంధమైన క్రియలు సాగించరాదు.
ఖల రతం:
వేశ్యా వృత్తిలో వున్నవారు తమ కోరికను అనుసరించి ఎక్కువ సేపు రతి సాగించగల విటులు లభించనప్పుదు అందుబాటులో ఉన్నవారితో కాని, లేదా కాయ కష్టం చేసే వారితో కాని తమ కోరిక తీర్చుకుంటే అప్పుడది ఖల రతం అని అంటారు...
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
ఖల రతం కూడా ఒకవిధమైన పోటారతంవంటిదే. స్త్రీ తన కోరిక ప్రకారం, తను ఇష్టపడిన వ్యక్తిని ప్రేరేపిం చి అతనితో సాగించే రతిని ఖల రతం అనే అంటారు.
అనియంత్ర రతం:
చిన్నతనం నుండీ లేదా ఎక్కువకాలం కలిసిమెలిసి ఉన్న స్త్రీ పురుషుల మధ్య జరిగే రతాన్ని అనియంత్ర రతం అని అంటారు.
ఈ రకమైన రతంలో స్త్రీ పురుషుల మధ్య ఎంతో కాలంగా సాన్నిహిత్యం ఉంటుంది. అందునా వారిరువురూ ఒకరిపై ఇష్టం చూపుతూ రతి క్రీడలో పాల్గొంటుంటారు కాబట్టి స్త్రీ పురుషుల నడుమ అనురాగం తప్పక జనిస్తుంది.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
రతి క్రీడలో స్త్రీ పురుషుల ఇష్టాయిష్టాలను అనుసరించి వాత్స్యాయనుడు వర్గీకరించిన రకాలివి. మనోభీష్టాన్ని అనుసరించి వర్గీకరించినట్ట స్థల కాలాదులను, బంధాలను అనుసరించి కూడా వాత్స్యాయనుడు రతి క్రీడను వర్గీకరించాడు. అవేమిటో చూసే ముందు ముందుగా బంధాలు అంటే ఏమిటో తెలుసుకుందాం.
స్త్రీ పురుషులు రతి క్రీడలో పాల్గొనే వివిధ భంగిమలనే బంధాలని అంటారు.
ఇవి రకరకాలుగా ఉండచ్చు. జంతువులు రతి సాగించే భంగిమలు కావచ్చు, స్త్రీ పురుషులు రతిలో సామాన్యానికి భిన్నంగా సాగించే భంగిమలైనా కావచ్చు. ఏదేమైనా ఇది భంగిమ ప్రధానమైంది.
బంధాలలో ఎన్నో రకాలుండచ్చు. శునక బంధం, తురగాధి రూఢక బంధం, గజోప మర్దన బంధం ఇలా ఎన్నో రకాలున్నాయి. వీటి గురించి ముందుముందు తెలుసుకుందాం.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
వాత్స్యాయనుడి కాలంలోని దేశాలను, ఆయాదేశాలలోని స్త్రీ పురుషుల అభిరుచులను కూడా ఆయన రచనల ద్వారా తెలుసుకోవచ్చు.
ఏయే దేశ స్త్రీలు ఎటువంటి చేష్టలను ఇష్టపడతారో వాత్స్యాయనుడు వివరించాడు.
వీటిని గురించి వచ్చే భాగాలలో తెలుసుకుందాం.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
No comments:
Post a Comment